ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

Apr 14, 2024 - 20:18
Apr 14, 2024 - 22:49
 0  401
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలు

తిరుమలగిరి 15 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మరియు గ్రామస్తులు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం యువజన సంఘం ఇన్చార్జి జోగు రామచంద్రు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ జీవితం, సాధనల గురించి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల ప్రజలలో ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకుంది.

  సామాజిక న్యాయం, సమానత్వం గురించి ప్రధానంగా చర్చించడం జరిగిందన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం ద్వారా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి, సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వాన్ని నెలకొల్పడానికి కృషి చేయాలని తెలిపారు  అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తొండ గ్రామ ఇన్చార్జి మారయ్య మాజీ సర్పంచి మాజీ ఎంపిటిసి వివిధ పార్టీ అధ్యక్షులు వార్డు మెంబర్లు అంబేద్కuర్ యువజన సంఘం సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తో పాటు అనేక మంది ప్రజలు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034