ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదిన సందర్భంగా వెల్దేవి గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టల పంపిణీ కార్యక్రమం
అడ్డగూడూరు 14 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు జన్మదినం సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికులకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వెల్దేవి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మంటిపల్లి గంగయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పార్టీ అభిమానులు వివిధ సంఘ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.