మహిళల అభ్యున్నత కు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి సీఎం .
నిరుపేద ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ .
మహిళలకు వడ్డీలేని రుణాలను చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ .
ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్ . ..
జోగులాంబ గద్వాల 19 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల .*నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలోని మండల మహిళా సమైక్య భవన్ నందు ఇందిరా మహిళ శక్తి సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా *గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ . , అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ , స్థానిక సంస్థల కలెక్టర్ నర్సింగ్ రావు హాజరయ్యారు.
ఎమ్మెల్యే కి మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు , నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు ...
ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ మండల సమైక్య భవన్ ఆవరణంలో మొక్కలు నాటడం జరిగింది .
తెలంగాణ రాష్ట్ర అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు లను ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది .
*మహిళా సంఘాలకు సంబంధించిన రుణాల చెక్కులను ఎమ్మెల్యే కలెక్టర్ చేతుల మీదుగా మహిళలకు అందించడం జరిగింది ....
ఎమ్మెల్యే మాట్లాడుతూ.....
గతంలో గట్టు మండలం ఎడారి ప్రాంతంగా ఉండేది ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు గ్రామాల నుండి వలసలు వెళ్లేవారు. కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి గట్టు మండలం అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేయడం జరిగింది ఈ ప్రాంత అభివృద్ధి కోసం నీటి సాగునీరు, రైతులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా విద్య వైద్య రంగ అభివృద్ధి కోసం కూడా కృషి చేయడం జరుగుతుంది ఇప్పుడిప్పుడే విద్యారంగం అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలి చదివించడం వల్ల మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుంది. రైతులకు రైతుబంధు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ 200 యూనిట్లు కరెంటు ఉచితం, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పంపిణీ ఇలాంటి అనేకమైన వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి రూపొందించి నిరుపేదలైన ప్రజలకు అందించడం జరుగుతుంది తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైన ప్రజల కోసం ప్రజలకు ఇల్లు ఉండాలని సొంతింటి కల నెరవేరాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఇందిరమ్మ ఇళ్లలో ప్రొసీడింగ్ పత్రాలను మంజూరు చేయడం జరిగింది. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు తొందరగా ఇంటి నిర్మాణం చేసుకోవాలి కోరారు. రానివాళ్లు ఎవరు కూడా అదేర పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది.
అదేవిధంగా మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేయడం జరిగింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా అంది రంగాల్లో రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులు చేయాలని అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించి మహిళలకు మహిళా సంఘాల గ్రూపుల ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలను అందించడం జరుగుతుంది. వాటి ద్వారా మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలి అదేవిధంగా ఆర్టీసీ బస్సులను కూడా మహిళలకు అందించడం జరిగింది అదే విధంగా సోలార్ ప్రాజెక్టులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యాంటీన్సు, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలి ఇలా చిన్న సంస్థల నుండి పెద్ద సంస్థలు ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదిగినప్పుడే వారు కూడా కోటీశ్వరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిరుపేదలైన ప్రజలకు రేషన్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది గట్టు మండలానికి 1700 రేషన్ కార్డు మంజూరు కావడం జరిగింది. రేషన్ కార్డు ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే సన్నబియ్యం, నిత్యవసర సరుకులు లభించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రేషన్ కార్డును ఉపయోగించుకొని ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలని కోరారు.
నన్ను రెండోసారి గెలిపించి ఆశీర్వదించిన గద్వాల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే ప్రభుత్వంతో భాగస్వామును కావడం జరిగింది గద్వాల నియోజకవర్గం ప్రజల కోసమే గద్వాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మద్దతు తెలపడం జరిగింద ని తెలిపారు .
భవిష్యత్తులో మహిళలు అన్ని రంగాలలో రాణించాలి పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదగాలని కోరారు* .
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో భాగంగా మహిళలు కూడా ఆర్థిక ఎదగాలని ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఏర్పాటుచేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆర్టీసీ బస్సులను ద్వారా ఏర్పాటు చేసి సోలార్ కంపెనీ, వ్యాపార సంస్థ మహిళల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రధాన కల్పించడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి మహిళలు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని కోరారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ త్వరగా నిర్మాణం చేసుకొని కోరారు.
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, రాష్ట్ర మాజీ ఛైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు మాజీ ఎంపీపీ విజయ్, PACS ఛైర్మన్ వెంకటేష్, జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, రామకృష్ణ రెడ్డి, నాయకులు ఆనంద్ గౌడు, రామాంజనేయులు, గద్వాల తిమ్మప్ప, మహేశ్వర్ రెడ్డి, సిద్ధిరామప్ప, తిమ్మప్ప, ఆలీ , సురేష్, హనుమంతు రెడ్డి,షేడ్రిక్ , ప్రవీణ్ , తిమ్మప్ప, నరేందర్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, సంతోష్, సిద్దు ఆనంద్, వివిధ గ్రామాల నాయకులు, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, మహిళా సంఘం అధ్యక్షురాలు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.