చిన్న పాపతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతీ

శాలిగౌరారం 05 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
ఆరోగ్య మానసిక స్థితి బాగోలేక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి వివరాలకు వెళితే నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వాణి (23) తన (8) నెలల పాప తో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది కొన్ని నెలలుగా ఆరోగ్య మానసిక స్థితి బాగోలేక ఆత్మహత్యకు పాల్పడింది స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీస్ మరియు ఫైర్ సిబ్బంది బావిలో గాలించి ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు పాప మృతదేహం కోసం వెతికిన దొరకలేదు చీకటి కావడంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.....