ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

తిరుమలగిరి 20 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది వివరాలకు వెళితే అంబటి రాములు అలియాస్ కృష్ణ (37) చిన్న పడిశాల గ్రామం అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు సూర్యాపేట టు జనగాం హైవేపై తిరుమలగిరి మండల కేంద్రంలోని వశిష్ట స్కూల్ సమీపంలో అతి వేగంగా బైక్ (TG 30 A 8605 passion pro) అదుపుతప్పి మూల మలుపుతుండగా రోడ్డుకు కుడివైపున రక్షణ కోసం ఏర్పాటు చేసిన క్రాస్ కి ఢీకొట్టడం వల్ల ఛాతికి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతుని తల్లి అంబటి సావిత్ర ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు......