చక్రయ్య హత్య కేసులో నిందితుల అరెస్ట్

Mar 25, 2025 - 22:35
Mar 26, 2025 - 07:06
 0  33
చక్రయ్య హత్య కేసులో నిందితుల అరెస్ట్

చక్రయ్య హత్య కేసులో మరో 15 మంది నిందితులను అరెస్ట్ చేసిన నూతనకల్ పోలీసులు.

సూర్యాపేట సబ్ డివిజన్ కార్యాలయం నందు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన కేసు దర్యాప్తు అధికారి తుంగతుర్తి సర్కిల్ CI శ్రీను.

సూర్యాపేట, 25 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-మిర్యాల గ్రామంలో ఈనెల 17 వ తేదిన జరిగిన మెంచు చక్రయ్య హత్య కేసు కు సంబంధించి ఈరోజు మరో 15 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను తెలిపారు. తప్పించుకుని తిరుగుతున్న వీరిని నమ్మదగిన సమాచారం మేరకు ఎర్రపాహడ్ గ్రామం అడ్డ రోడ్డు వద్ద నూతనకల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పంచుల సమక్షంలో పట్టుబడి పంచనామా నిర్వహించడం జరిగినది. హత్యకు సంభందం కలిగి ఉన్నారు అని CI తెలిపినారు. 

అరెస్ట్ చేయబడిన నిందితులు..

A-9 అనంతుల నాగరాజు,

A-11 మోసంగి భరత్,

A-13 పెద్దింటి గంగమల్లు,

A-18 చెలగల సంతోష్,

A-19 కనకటి సతీష్, 

A-27 పెద్దింటి నాగయ్య, 

A-28 వీరమల్ల మల్లయ్య,

A-32 కట్ల వెంకన్న, 

A-33 వర్థెల్లి మహేష్,

A-34 మోసంగి రాకేష్,

 A-36 తరాజుల సైదులు, 

A-37 అనంతుల శ్రీధర్,

A-38 పెద్దింటి మహేష్,

A-39 ఉప్పల వెంకన్న, 

A-40 పెద్దింటి లింగుస్వామి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333