డాక్టర్ హారిక ఆధ్వర్యంలో పలు ఇంట్లో దోమల మందు పిచికారి

Jul 22, 2025 - 20:04
 0  0
డాక్టర్ హారిక ఆధ్వర్యంలో పలు ఇంట్లో దోమల మందు పిచికారి

చర్ల జులై 22

మండల పరిధిలో ఉన్న కొయ్యూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక ఆధ్వర్యంలో మలేరియా ప్రభావిత ప్రాంతమైన క్రాంతి పురం, గొల్లగూడెం, రేగుంట, కొత్తూరు, కేశవపురం గ్రామాలలో ప్రతి ఇంట్లో దోమల మందు పిచికారి చేయించారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ వర్షాకాలం మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, ప్రజలు సాధ్యమైనంతవరకు దోమలు పుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఫ్రైడే - డ్రై డే పాటించాలని. ఇంటి పరిసరాలలో నీటి నిలువలు లేకుండా చూసుకోవాలన్నారు. నిద్రించేటప్పుడు దోమలు కుట్టకుండా ప్రతి ఒక్కరు దోమతెరలు వాడాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు, హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ ధర్మారావు, మరి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.