ప్రధానోపాధ్యాయుని సస్పెండ్ ను రద్దు చేయాలాంటూ కలెక్టర్, డీఈఓ వినతి పత్రం

Jul 19, 2025 - 19:27
Jul 19, 2025 - 19:44
 0  13
ప్రధానోపాధ్యాయుని సస్పెండ్ ను రద్దు చేయాలాంటూ కలెక్టర్, డీఈఓ  వినతి పత్రం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ప్రధానోపాధ్యాయుని సస్పెండ్ ను రద్దు చేయాలాంటూ కలెక్టర్, డీఈఓ వినతి పత్రం నెమ్మికల్ జడ్పీ పాఠశాల విద్యార్థుల పేరెంట్స్ పిర్యాదు.. విద్యార్థులు ఆందోళన చేస్తారని పాఠశాల ముందు పోలీస్ బందోబస్తు.. సస్పెండ్ రద్దు చేయకుంటే పాఠశాల కు వెళ్ళమంటూ విద్యార్దుల ఆందోళన.. ఆత్మకూరు ఎస్.. క్రమశిక్షణ నిబద్ధత పాఠశాల అభివృద్ధి ఉత్తమ విద్యా అందిస్తూ ఉపాధ్యాయుల తో ఐకమత్యంగా ఉండే ప్రధానోపాధ్యాయుని సస్పెండ్ ను రద్దు చేయాలని విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. 40 మంది విద్యార్థులు నుండి మూతపడే దశలో ఉన్న ఆత్మకూరు మండలం నిమ్మికల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను గత కొద్ది రోజుల్లోనే 120 మంది విద్యార్థులకు పెంచి పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీహరిని అమానుషంగా సస్పెండ్ చేయడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పాఠశాల పేరెంట్స్ గ్రామస్తులు శనివారం జిల్లా కలెక్టర కు డీఈఓ కు వినతిపత్రం అందజేశారు. తన దగ్గర పనిచేస్తున్న ఉపాధ్యాయుని సబ్జెక్టులో లోపం ఉండగా శాఖా పరంగా వేతన చర్యలతో పాటు తన వేతనం పై కూడా శాఖా పరంగా శిక్ష వేసుకున్న ఉత్తమ క్రమశిక్షణ గల ప్రధానోపాధ్యాయుని పట్ల ఎవరో ఒకరు ఆధారాలు లేని ఆరోపణలు ముచ్చటలు చేయగా ప్రాథమిక విచారణ చేయకుండాసస్పెండ్ చేయడం తగదని ఫిర్యాదుల పేర్కొన్నారు. పాఠశాల లో అదనపు క్లాసులు అదనపు సమయాన్ని కేటాయించి విద్యార్థుల కు 100% ఫలితాలు తెచ్చిన ప్రధానోపాధ్యాయునికి సస్పెన్షన్ రద్దు చేయాలని కనీసం గ్రామంలోని పాఠశాలలోనూ విద్యార్థుల వారి పేరెంట్స్ తో కనీస విచారణ చేపట్టకుండా చర్యలు తీసుకోవడం అనేది తగ్గదని అన్నారు. సస్పెన్షన్ సమాచారం తెలుసుకున్న పేరెంట్స్ విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకో చేసేందుకు ప్రయత్నం చేయగా పాఠశాల ముందు శనివారం సాయంత్రం అధికారులు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 వరకు కొనసాగే పాఠశాల తరగతులు శనివారం సాయంత్రం నాలుగు గంటలకే ముగిశాయి. ప్రధానోపాధ్యాయులు లేకపోవడంతో అదనపు క్లాసులు నిర్వహించలేదని ఆ పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు శ్రీహరి సస్పెండ్ ను రద్దు చేసే వరకు విద్యార్థులు ఎవరు పాఠశాలకు హాజరుకారని విద్యార్థులను పంపించమంటూ పేరెంట్స్ తెలుపుతున్నారు.