ఇసుక డంప్ చేసిన వ్యక్తుల పై కేసు నమోదు...ఎస్సై వెంకట్ రెడ్డి 

Jul 19, 2025 - 18:54
 0  7
ఇసుక డంప్ చేసిన వ్యక్తుల పై కేసు నమోదు...ఎస్సై వెంకట్ రెడ్డి 

అడ్డగూడూరు 19 జులై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– సమాచారం ప్రకారం హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, అందుబాటులో ఉన్న పోలీస్ సిబ్బందితో చిరగూడూరు గ్రామానికి రాత్రి 8.00 గంటల సమయంలో చిర్రగూడూరు గ్రామంలోని కూటికంటి రమేష్ ఇంటి వద్ద వెళ్లి చూడగా!అక్కడ ఇసుక డంప్ చేసి ఉంది అక్రమంగా తరలించడానికి ప్రయత్నస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు ఏ–1 బండి సాయి కుమార్ తండ్రి చంద్రయ్య,వయస్సు 25 సంవత్సరాలు,కులం గౌడ్,చిర్రగూడూరు గ్రామం అడ్డగూడూరు మండలం పేర్కొన్నరు. పై వ్యక్తి చిర్రగూడూరు గ్రామ శివార్లలోని బిక్కేరు వాగు నుండి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని మరియు డంప్ చేస్తున్నామని వారు చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక రవాణా చేస్తున్నారు.పోలీసులు పైన పేర్కొన్న 24 టన్నుల ఇసుక డంప్ ను స్వాధీనం చేసుకున్నారు.పోలీస్ లు నిందితుడిని అదుపులోకి తీసుకుని రాత్రి 11:30 గంటలకు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన అడ్డగూడూరు పోలీసులు సూ-మోటో కేసు నమోదు చేశామని ఎస్సై వెంకట్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333