సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనం.

Apr 1, 2025 - 21:36
 0  1

రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 48 వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల అబిష్ఠానికి అనుగుణంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా పాలన సాగిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చొరవతో ప్రజలందరికీ సన్న బియ్యం చేరువయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఊర రామ్మూర్తి యాదవ్, వల్లాస్ దేవేందర్, అరవింద రెడ్డి, నేరెళ్ల మధు గౌడ్, సాజిద్ ఖాన్, ఉపేందర్, ఈర్ల వాసు, ఎస్కే మీరా, గోగుల సైదులు, భరత్ కోల వీరేందర్, సాయి ,రవి మహిళలు వార్డుప్రజలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333