**మద్యపాన ప్రజలకు విజ్ఞప్తి""రైతులను ఇబ్బంది పెట్టవద్దు*

Jul 23, 2025 - 06:56
 0  1
**మద్యపాన ప్రజలకు విజ్ఞప్తి""రైతులను ఇబ్బంది పెట్టవద్దు*

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట :*మద్యపాన ప్రియులకు విజ్ఞప్తి!! మీరు మీ సొంత ఖర్చుతో తాగుతున్నారు. తప్పు లేదు!!* *కానీ.. దయచేసి చిన్న మనవి!! ఇప్పటి నుండి రైతులకు పంట పొలాల్లో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి.* *అలాంటి రైతుల పంట పొలాల్లో మీరు తాగిన మద్యం సీసాలు పగలకొట్టకుండా!! ఎక్కడపడితే అక్కడ వేయకుండా!! ఉంటారని రైతన్నలు ఆశిస్తున్నారు!!* *ఎందుకంటే మీరు పగలగొట్టి విసిరేసే (మద్యం సీసా పెంకులు) పొలం దున్నేటప్పుడు వారి అరికాళ్ళల్లో కానీ! ఎద్దుల అరికాళ్ళల్లో కానీ! గుచ్చుకుంటే ఎంత బాధగా ఉంటుందో కొంచెం మనిషిగా, మానవత్వంగా ఆలోచించండి!!*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State