మురుగు నీటిలో వరి నాట్లు వేసి నిరసన తెలిపిన గ్రామస్తులు
ఇండ్ల ముందు నిలిచిన మురుగు నీరు
వాహనదారులు ఇబ్బందులు
జోగులాంబ గద్వాల 14 జులై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : కేటిదొడ్డి మండల పరిధిలోని కుచినెర్ల గ్రామంలో రోడ్లపైనే మురుగు నీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. గత కొంతకాలంగా ఇండ్లలో నుంచి వస్తున్న మురుగు నీరు రోడ్లపై పారడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ?ప్రధానంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.మురికి నీరు రోడ్డుపై నిల్వ ఉన్న పంచాయతీ సెక్రటరీ పట్టించుకోకపోవడం వారి పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు అని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి కాలనీలో మురుగునీళ్లు లేకుండా చూడాలని ఉన్నది అధికారులను కోరుతున్నారు.