సరూర్ నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Jul 11, 2025 - 13:06
Jul 11, 2025 - 19:04
 0  4
సరూర్ నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఎల్బీనగర్;11 జూలై 2025 శుక్రవారం తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎల్బీనగర్ నియోజకవర్గం సరూర్ నగర్ జిహెచ్ఎంసి సర్కిల్ 3 ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం శాలువాలతో, పూలమాలలతో, పూల బోకెలతో కేకు కతరించి ,ఒకరిని ఒకరి తినిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తదనంతరం డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యక్షంగా ,పరోక్షంగా, చరవాణిలో, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, జిహెచ్ఎంసి ప్రతినిధులు , మిత్రులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.