మోడీ విజయం దేశానికి తలమానికం

Jun 9, 2024 - 20:48
Jun 10, 2024 - 10:16
 0  29

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్:- మోడీ విజయం దేశానికి తలమానికం* ఆత్మకూర్ ఎస్... బీజేపీ మూడోసారి గెలుపు దేశానికి తలమానికమని దేశ అభివృద్ధి కి మోడీ విజయం పట్ల ప్రజలు హర్శిస్తున్నారని బీజేపీ జిల్లా కార్యదర్శి టెలికం అడ్వజరి కమిటీ బోర్డు మెంబర్ సంద్యాల సైదులు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరుల తో మాట్లాడుతూ మోడీ మూడో సారి ప్రధాని గా ప్రమాణం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మోడీ సేవలు ప్రజలకు ఎంత అవసరం అన్నారు. భారతీయులంతా మోడీ పరిపాలన స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పంది రామ్ రెడ్డి, అస్లాం, భయ్యా లింగయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు