ఐజ పట్టణం చినుకు పడితే చిత్తడే చిత్తడే
జోగులాంబ గద్వాల 19 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఐజ మున్సిపల్ కేంద్రంలో చినుకు పడితే చిత్తడే అన్నట్టుగా రోడ్డుమీద పడ్డ నీరు డ్రైనేజ్లోకి పోకుండా షాప్ ల వారు మట్టి రోడ్డు కంటే ఎత్తుగా వేసి షాపు వారు చిరు వ్యాపారస్తులకు వేలకు వేలు కిరాయిలు ఇచ్చుకుంటున్నారు. వారు వేసిన మట్టి వల్ల వర్షపు నీరు రోడ్డుపై నిల్వ ఉంటుంది. రోడ్డుపై నీరు నిల్వ ఉండటం వల్ల పాదాచార్లకు చిరు వ్యాపారులకు, వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్టి విషయం చాలా సార్లు మున్సిపల్ అధికారులకు తెలిపిన కూడా వారు పట్టించుకోవడం లేదు వర్షాకాలం లోనైనా షాప్ లో ముందున్నటువంటి వాటిని తొలగించి డ్రైనేజ్ లోకి వర్షపు నీరు పోయేటట్టుగా చేయగలరని ఐజ పట్టణ వాసులు కోరుకుంటున్నారు. ఐజ మున్సిపల్ కేంద్రం పన్నులు వసూలు చేయడంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుంటుందని ఐజ మున్సిపల్ అధికారులు నిరూపించుకోగలరు.