జయప్రద ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తొండపు జనార్దన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం""సుమారు 80 మందికి ఆపరేషన్లు

జయప్రద ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తొండపు దశరథ జనార్ధన్ గారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరంలో గుర్తించబడిన వారిలో గతంలో ఆపరేషన్ చేయగా మిగిలిన వారు గౌరవరం గ్రామం నుండి 9 మందినీ, వత్సవాయి గ్రామం నుండి గత వారంలో 80 మందికి ఆపరేషన్ చేయగా మిగిలిన ఐదుగురు లో శుక్లములు ఉన్న వారిని శంకర్ నేత్రాలయం విజయవాడ వారి వద్ద నిన్న శుక్లముల ఆపరేషన్ చేయబడి నేడు వారి గ్రామాలకు తరలిస్తున్న ప్రత్యేక వాహనం నుండి గౌరవరం, వత్సవాయి గ్రామాలకు తీసుకొని వచ్చిన జయప్రద ఫౌండేషన్ కోఆర్డినేటర్ కట్టా వెంకట నరసింహారావు. ఆపరేషన్ చేయించుకున్న వారు మాట్లాడుతూ ఆపరేషన్ చాలా బాగుందని చాలా సౌకర్యవంతంగా వారు భోజన ఏర్పాట్లు వసతి ఏర్పాట్లు బాగా చేశారని, వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జయప్రద ఫౌండేషన్ వారు బాగా చూసుకున్నందుకు చైర్మన్ దశరథ జనార్ధన్ గారికి, మరియు వారి టీం సభ్యులకు మా ధన్యవాదాలు అంటూ సంతోషాన్ని వ్యక్తపరిచినారు.