దొంగతనాల నివారణలో జిల్లా పోలీసు శాఖ

సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం తేది:27/4/2025
దొంగతనాల నివారణలో జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా పనిచేస్తుందని, ప్రతిరోజూ తనిఖీలు, పెట్రోలింగ్ చేస్తూ నిఘా ఉంచాం, ప్రజలు పోలీసులు తెలిపే సూచనలు పాటించాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. వేసవికాలం సెలవులు ఉన్నందున ఎక్కువమంది దూర ప్రాంతాలకు వెళుతుంటారు ఈ క్రమంలో ఇంటివద్ద జాగ్రత్తపరమైన చర్యలు తీసుకోవడం వల్ల దొంగతనాలను నివారించవచ్చు అని ఎస్పీ గారు తెలిపారు. ఎక్కువ రోజులు ఇండ్లు వదిలి వెళ్ళేవారు ఇరుగుపొరుగు వారికి మరియు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటికి అలారం సిస్టమ్ పెట్టుకోవాలి, CC కెమెరాలు ఏర్పాటు చేసుకుని మొబైల్ ఫోన్ ద్వారా చూసుకోవాలి, ఆరుబయట మేడపైన పడుకునే వారు మెడలో ఆభరణాలు ఉంటే జాగ్రత్త గా ఉండాలి, వాకిట్లో ముగ్గులు వేసే సమయంలో ఆభరణాలను చీర పైటతో కవర్ చేసుకోవాలి, ఒంటరిగా మహిళలు నడిచి వెళుతూ ఉంటే ఎవరైనా అపరిచితులు అడ్రస్ అడుగుతూ ఏమార్చి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.
*సూర్యాపేట జిల్లా పోలీసు వారి ముఖ్య సూచనలు.*
???????? ఇంటి గేటుకు బయట వైపు తాళం వేసి ఉంచవద్దు.
????????ఇంటి బయట, డాబాల పైన పడుకునేవారు తమరి మెడలో నగలని జాగ్రత్తగా పెట్టుకోండి మరియు ఇంటిలో బంగారు ఆభరణాలు ఉంచకండి.
????????బస్సుల్లో ప్రయాణాలు చేసేవారు మీ బ్యాగ్ను మీ పైన ఉంచుకొని గట్టిగపట్టుకొని వెంట అంటిపెట్టుకోండి. గుర్తు తెలియని వ్యక్తులు తిను బండరాలు, కూల్డ్రింక్స్ లాంటివి ఇస్తే తినకండి తీసుకోకండి.
????????మీరు ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు మరియు బంగారం ఆభరణాలు పెట్టకండి వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం.
????????బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ, బీరువాలోని బట్టల క్రింద, ఇంట్లో పెట్టి వెళ్లవద్దు.
????????వాహనాలను ఇంటి వద్దనే పార్క్ చేసి తాళం చెవులు వెంట తీసుకుని వెళ్తే మంచిది.
????????ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి గేటు బయట గొళ్ళెం పెట్టకండి.
????????ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు, తాళం కనపడకుండా కర్టెన్స్ వేయాలి.
????????ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి.
????????బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి.
????????బయటకు వెళ్ళేపుడు ఇంట్లో మరియు బయట లైట్ వేసి ఉంచండి.
????????మీరు ఎక్కువరోజులు దూరప్రాంతాలకు వెళితే పేపర్ బాయ్ మరియు పాల వాళ్లకు రావద్దని చెప్పండి.
????????నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే నియమించుకోండి.
????????మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.
????????ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి.
????????బయటకు వెళ్లేటప్పుడు, వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్త. వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిది.
????????మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే దొంగలు భయపడే అవకాశం ఉంది. భద్రత ఎక్కువగా ఉంటుంది.
????????మీ ఇంటికి సీసీ కెమెరాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని DVR రహస్య ప్రదేశాలలో భద్రపర్చుకోవాలి. మరియు మొబైల్ యాప్ ద్వారా సీసీకెమెరా దృశ్యాలు ఎప్పటికప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది.
????????మీరు బయటికి వెళ్ళే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయకండి. మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి.