పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు

కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పునర్ నిర్మాణం జరుగుతుంది..
ఏఐసీసీ సభ్యులు జిల్లా ఎన్నికల పరిశీలకులు సంపత్ కుమార్, ఎమ్మెల్యే మందుల సామేలు..
తిరుమలగిరి 23 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి గుర్తింపుతో పాటు పదవులు లభిస్తాయని ఏఐసీసీ సభ్యులు జిల్లా ఎన్నికల పరిశీలకులు సంపత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షులు కర్గే, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా అధ్యక్షులు నూతన కమిటీ, మండల కమిటీల పేర్లను, రానున్న స్థానిక ఎన్నికల పోటీ చేయు వారి పేర్లను కూడా, పనిచేసే వారిని గుర్తించి, ఎన్నికల బరిలో నిలబెడతామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న యాదవ్ గుడిపాటి నరసయ్య మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ పేరాల వీరేష్ కందుకూరి అంబేద్కర్ కందుకూరి లక్ష్మయ్య 9 మండలాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు