దర్శక నిర్మాత రవీంద్ర ఆరోరా మృతి సినీ లోకానికి తీరని లోటు..
సామాజిక సేవకులు డాక్టర్ చాంద్ పాషా..
Hyderabad 6 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ముంబై సినీ లోక దర్శక నిర్మాత రవీంద్ర ఆరోరా అనారోగ్యంతో మృతి చెందడంపై సామాజిక సేవకులు, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సంతాపం వ్యక్తం చేశారు. ముంబై సినీ రంగంలో రవీంద్ర ఆరోరా నిర్మాతగా, దర్శకుడిగా వేలాదిమంది నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.
దాదా ఫాల్కే సావిత్రిబాయి అవార్డును రవీంద్ర అరోరా చేతుల మీదుగా అందుకోవడం మరువలేనిది. సామాజికవేత్తగా ప్రపంచంలోని సమస్యలు తరచూ చర్చించే వారమని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రవీంద్ర ఆరో ర మృతి ముంబాయి సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు.