వర్ధమానుకోట గ్రామంలో విషాదం
నాగారం 21 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో బిక్కేరు వాగు చెక్ డ్యాం నీటి ఉధృతి లో కమ్మంపాటి మణీశ్వర్ (11)అనే బాలుడు గల్లంతయ్యాడు. ఆదివారం సాయంత్రం సెలవు కావడంతో గ్రామానికి చెందిన నలుగురైదుగురు బాలురు కలిసి వాగుని చూడటానికి వెళ్లారు. నీటిలోకి దిగి ఆడుకుంటుండగా వారిలో ఒక బాలుడు మిగతావాళ్ల కళ్లముందే నీటి ఉధృతి కి కొట్టుకొని పోవడంతో మిగతా వారు భయంతో బాలుడు గల్లంతు అయిన విషయాన్ని ఎవరితో చెప్పకుండా ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు.మనీశ్వర్ తల్లిదండ్రులైన కమ్మంపాటి నాగరాజు ఉపేంద్ర పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మనీశ్వర్ కనిపించక పోవడం తో అతనితో వెళ్లిన వారిని మందలించగా చేయగా పొంతన లేని సమాధానాలు చెప్పగా వారిని పోలీసులు గట్టిగా అడుగగా నీటిలో గల్లంతైన విషయాన్ని తెలిపారు.చెక్ డ్యాం వద్ద మునీశ్వర్ వేసుకున్న చొక్కా,కీ చెయిన్ లభించగా, మృతదేహం కోసం వలలతో గాలింపు చేపట్టారు.మృతదేహం చెక్ డ్యాం ముందు వైపు లభ్యమవడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాధ కొన్నారు దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి