పత్తి విత్తన రైతులు పండించిన పంట ఎన్ని క్వింటాలు పండించిన మొత్తం పంటను ప్రతి గింజను కూడా సీడ్ కంపెనీలు కొంటాయి అని రైతులకు హామీ

ఇచ్చిన జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్

Jul 17, 2025 - 19:41
 0  5

కలెక్టర్ హామీతో సంతోషం వ్యక్తపరిచిన రైతులు

రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సీడ్ పత్తి రైతులు

రైతుల నినాదాలతో దద్దరిల్లిన కలెక్టర్ కార్యాలయం  

జోగులాంబ గద్వాల 17 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి ; గద్వాల. జిల్లాలో సీడ్ పత్తి పండించిన రైతుల నుండి ఎకరాకు రెండు క్వింటాల పంటను మాత్రమే కొంటామని సీడ్ ఆర్గనైజర్లు కంపెనీలు రైతులపై షరతులు విధించడంతో పండించిన మొత్తం పంటను విక్రయించాలని నేడు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రైతులను రానివ్వడం లేదంటు కలెక్టర్ కార్యాలయం ముందు  బైఠాయించిన సీడ్ పత్తి రైతులు, అఖిలపక్ష నాయకులు నిరసన తెలిపారు.. అనంతరం ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అందరిని లోపలకి పంపించి కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చోపెట్టిన అనంతరం బయటకు కలెక్టర్  వచ్చి అందరి రైతుల ముందు మీరు పండించిన పంట మొత్తం సీడ్ పత్తి కంపెనీలు కొంటాయని స్పష్టమైన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు అఖిలపక్ష కమిటీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరియు ఈ నిరసన కార్యక్రమంనకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా నాయకులు కురువ పల్లయ్య మీడియా తో మాట్లాడుతూ...

* చాలా కాలం నుంచి నడిగడ్డ ప్రాంతంలో పత్తి విత్తన రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి ఆర్గనైజర్లు మళ్ళీ ఈ సంవత్సరం మీరు పండించిన పంట ఎకరమునకు రెండు క్వింటాలే కొంటాం అని కొత్త నాటకానికి తేరలేపడం దుర్మార్గం. అందుకే రైతులు ఆగ్రహానికి గురై నిన్న బింగిదొడ్డి స్టేజ్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా మరియు ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన. అనంతరం కలెక్టర్  స్పష్టమైన హామీ ఇవ్వడంతో నిరసన విరమించిన రైతులు.

* ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అభివృద్ధికి తోడ్పడకుండా రైతు తలల మీద ఉరితాలు బిగిస్తున్నది ఇటు గిట్టుబాటు ధర కల్పించకుండా, పండించిన పంటను కొనకుండగా, మరి వరి పంటకు బోనస్ ఇవ్వకుండా, మరియు పేద రైతుల భూములను గుంజుకుంటూ వారి పైన అక్రమ కేసులు పెడుతూ కేవలం రైతుల పాలిట శాపంగా మారిన రేవంత్ రెడ్డి సర్కార్ అని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333