జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమానికి సిద్ధం...

May 3, 2024 - 21:46
 0  14
జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమానికి సిద్ధం...

పాలన ప్రజలకు చేరువ చేసేందుకే జిల్లాల ఏర్పాటు

 ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి .

జోగులాంబ గద్వాల 3 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  గద్వాల .. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు  సమావేశం నిర్వహించి   ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.... కొట్లాడి సాధించుకొని తెచ్చుకున్న రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో ప్రజాభిష్టానం మేరకు జోగులాంబ గద్వాల జిల్లాను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఆనాడు గద్వాల నియోజకవర్గంలో సబ్బండ వర్గాల ప్రజల పోరాటం ఫలితంగా 2016 అక్టోబర్ 16వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లాను సాధించుకోవడం జరిగింది. 

 తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్రంలోని ప్రజలకు పరిపాలన సులభంగా ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు పరిపాలన సులభంగా జరిగే విధంగా ప్రతి జిల్లాకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ కేటాయించడం జరిగింది.

 ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 140 రోజులకే పిచ్చి తుగ్లక్ పాలన తలపిస్తూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల 6 గ్యారంటీలకు అమలు పై, అభివృద్ధి పై దృష్టి పెట్టలేదు.  ప్రజల సమస్యపై ఏనాడు కూడా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించలేదు. కానీ జిల్లాలను రద్దు చేయాలని కమిటీని ఏర్పాటు చేసి ప్రజలకు సులభంగా జరుగుతున్న పరిపాలనను మళ్లీ ఒకసారి పూర్వం ఏ విధంగా ఉండేదో అదే విధంగా వచ్చే విధంగా సీఎం  రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.  జిల్లాలను రద్దు చేస్తానన్న ఆలోచనను వెనక్కు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

జిల్లాలను రద్దు చేసే ఆలోచన మానుకోవాలి. ప్రజా పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీ ల పైన దృష్టి పెట్టి ప్రజలను అభివృద్ధికి కృషి చేయాలని సూచిస్తున్నాం. జిల్లాను రద్దు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టంచేశారు. 

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, గద్వాల టౌన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కురుమన్న, అన్వర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333