**అరటి పువ్వు "మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు**

Jul 23, 2025 - 06:52
 0  1
**అరటి పువ్వు "మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు**

తెలంగాణ వార్త ప్రతినిధి : *అరటి పువ్వు - మనకు తెలియని ఎన్నో ఉపయోగాలు.*

 మధుహేహం ఉన్న వారికి ఈ పువ్వు సంజీవని… ఒక్కటి తింటే షుగర్ మటుమాయం!

అరటి పువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మెగ్నీషియం సాధారణంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ నేపథ్యంలోనే అరటిపువ్వు తీసుకోవడం వలన అందులోని మెగ్నీషియం మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతుంది. తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా రక్తహీనతతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.ఇటీవల కాలంలో గుండె సమస్యలు ఎక్కువగా కొవ్వు పదార్థాలను తీసుకోవడం వలనే వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే అరటిపువ్వు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడటంతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలవు. అరటి పువ్వులోని టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి. తద్వారా గుండె రోగులలో అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. ఈ కారణంగా రక్తహీనతతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుండి రక్షించి, సెల్ డ్యామేజ్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల మధుమేహం వల్ల కలిగే మానసిక నష్టం లేదా ఇతర అవయవ నష్టాన్ని కూడా తగ్గించవచ్చు.అరటి పువ్వు నెఫ్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీని కలిగి ఉంది. ఇది కిడ్నీ దెబ్బతినకుండా కాపాడుతుంది. అరటి పువ్వులలో ఉండే పీచు మూత్రపిండాల్లో రాళ్లతో పోరాడుతుంది. అరటి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ప్రోస్టేట్ గ్రంధి పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని సిట్రిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ ప్రోస్టేట్ గ్రంధిని సాధారణ పరిమాణానికి తీసుకువస్తాయి.అరటి పువ్వు అధిక రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. ఇది యాంటీ హైపర్‌టెన్సివ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించగలదు. ఇందులో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక పోషకాలు అనేక ఇతర వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అరటి పువ్వులో ఉండే జింక్ ఎముకల నష్టాన్ని నివారిస్తుంది. ఇందులో క్వెర్సెటిన్, కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి..!!

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State