ఇంద్ర అనాధ వృద్ధాశ్రమంలో పండ్లు బ్రెడ్డు పంపిణి

Apr 14, 2024 - 20:05
Apr 14, 2024 - 22:50
 0  11
ఇంద్ర అనాధ వృద్ధాశ్రమంలో పండ్లు బ్రెడ్డు పంపిణి

మునగాల 14 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- మునగాల మండల పరిధిలోని ముకుందాపురం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రయంలో బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాలే సామేలు పుట్టినరోజు వేడుకలు ఆశ్రమంలోని వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు, బ్రెడ్ ప్యాకేటు లు పంపిణీ చేసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా సామేలు మాట్లాడుతూ... ఇలా పుట్టినరోజు వేడుకలు ఆశ్రమంలోని అనాధలు, వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజు, పెళ్లిరోజు లను అనాధ ఆశ్రమంలో జరుపుకోవాలని కోరారు. ఇంతమంది అనాధలను వృద్ధులను చేరదీసి ఆశ్రమాన్ని నడిపిస్తున్న ఆశ్రమ నిర్వాహకురాలు విజయమ్మను అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి దృష్టికి తీసుకెళ్లి ఆశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి, గుడిపాటి కనకయ్య, పెద్ద కనకయ్య, చిర్రా నరేష్, సాయి, ఉపేంద్రాచారి, రాంబాబు, షరీఫ్, భార్గవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State