జూనియర్ కళాశాలకు విరాళం అందించిన ఎమ్మెల్యే

తిరుమలగిరి 23 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మౌలిక సదుపాయాల కోసం తన సొంతంగా 50,000 రూపాయలను విరాళంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అందించారు తాను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తిరుమలగిరి కి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కళాశాల అధ్యాపక బృందం ఎమ్మెల్యే సామెల్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చెవిటి వెంకన్న యాదవ్ ఎల్సోజు నరేష్ పేరాల వీరేష్ పాలపు చంద్రశేఖర్ కందుకూరి లక్ష్మయ్య కందుకూరు అంబేద్కర్ అధ్యాపక బృందం పాల్గొన్నారు