నేలకొండపల్లి ఎస్సై సంతోష్ కు దివ్యాంగుల వినతి పత్రం...!
పాలేరుప్రతినిధి/తెలంగాణ వార్త...ఆగస్టు 18 ఆదివారం టిడిజెఏసి ఆధ్వర్యంలో జెఎసి చైర్మన్ పి.వి చలమయ్య ఆమరణనిరాహారదీక్ష ఆదివారంతో రెండు రోజులకు చేరింది. దివ్యాంగుల పట్ల అను చితంగావ్యాఖ్యలు చేసిన స్మితసబర్వాల్ క్షమాపణలు చెప్పాలని దివ్యాంగులకు చట్టం 2016 ప్రకారం అమలు జరపాలని ప్రభుత్వం చేయాలని ఖాళీగా ఉన్న బ్యాగు లాక్ పోస్టులు భర్తీ చేయాలని వయోపరిమితిని పెంచాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోస్థానిక ఎస్సై పి సంతోష్ ను దివ్యాంగ ప్రతినిధులు ఆదివారం కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. తమ సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ల నున్నట్లు ఎస్సై తెలిపారని పి.వి చలమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సైని కలిసిన వారిలో వెంకటేశ్వర్లు ఆకం లక్ష్మి హుస్సేన్ తదితరులు ఉన్నారు.