తిరుమలగిరిలో నెమలి...స్వాధీనపరచుకున్న ఫారెస్ట్ అధికారులు

తిరుమలగిరి 05 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని సాయంత్రం సమయంలో ఒక నెమలి ఎగురుకుంటూ తిరుమలగిరిలోని లక్కీ బట్టల షాప్ ఎదురుగా జనవాసాల్లోకి రావడంతో అక్కడున్నటువంటి ప్రజలు పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో తిరుమలగిరి ఎస్సై వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది అక్కడికి వెళ్లి నెమలిని పట్టుకొని భద్రత నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్వాధీన పరుచుకున్న నెమలిని బొబ్బలి వెంకన్న, చండు వెంకటరమణ ఫారెస్ట్ అధికారులకు అందించారు వారి వెంట స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు