ఉత్తనూర్ గుడిపూజారి పైన దాడికి యత్నం
జోగులాంబ గద్వాల 15 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ మండల పరిధిలోని ఉత్తనూర్ గ్రామంలో గుడిపూజారిగా ఉన్న పూజారిపై అదే గ్రామానికి చెందిన సోమిరెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి గుళ్ళో మీరు పూజా చెయ్యకూడదు మీ కుటుంబం మంచిది కాదు అంటూ వ్యక్తిగత దాడికి దిగగా గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.అయితే పూజారి వ్యక్తిగత కక్ష్యలతో నేను గుళ్ళో వారు చెప్పినట్లు వినాలి అని లేకపోతే నిన్ను పూజారిగా తీసి వేస్తాం అని ఇలా చేస్తున్నారు అని వాపోయాడు. ఏదిఏమైనా ఇలా దాడికి దిగకుండా సామరస్యంగా ఆలయ కమిటీ వారితో చర్చించి సమస్యను పరిష్కారిచుకోవాలి అని గ్రామస్తులు కోరారు.