నెరవేరిన దశాబ్దాల కళ ప్రభుత్వ జూనియర్ కళాశాల..!
గతంలో ఎందరో ఎమ్మెల్యేలు మాటిచ్చారు.. మడమ తిప్పారు..
తిరుమలగిరి ప్రజలకిచ్చన మాట
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అనుమతి సాధించిన ఘనుడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కు జేజేలు పలుకుతున్న ప్రజానీకం,
ముఖ్యంగా విద్యార్ధుల ఆనందానికి అవధులు లేకుండా సంభ్రమాశ్చర్యంలో మునిగితేలుతున్నారు…
తిరుమలగిరి 07 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మూడున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల కలని నెరవేర్చిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుకు తిరుమలగిరి ప్రజానీకం నుండి ప్రశంసలు . వెలువెత్తుతున్నాయని తిరుమలగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అనేక మంది ఎమ్మెల్యేలు మాటిచ్చి నెరవేర్చలేని ప్రభుత్వ జూనియర్ కళాశాల కలను పట్టువదలని విక్రమార్కుడిలా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పట్టుబట్టి సాధించారు.స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట తీసుకోవడం,సీఎం ఆఫీసులోనే సంతకం పెట్టించడం,ఫైనాన్స్ శాఖ నుండి క్లియరెన్స్ ఇప్పించడం సోమవారం తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు భవనాన్ని పరిశీలించడం అన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకొని ఈ రోజు తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.వెంకటేశం నుండి జీవో కాపీని మంగళవారం విడుదల చేశారు.ఈ ఉత్తర్వు కాపీని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం హైదరాబాదులో స్వయంగా ఎమ్మెల్యే మందుల సామేలుకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలను తిరుమలగిరి మండల కేంద్రంలో మంజూరు చేసిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తెలిపారు.మంగళవారం ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.వెంకటేశం ద్వారా జీవో కాపీని అందుకున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల తిరుమలగిరిలో లేక ఎంతో మంది పేద విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డారని అన్నారు.తిరుమలగిరికి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేసినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తిరుమలగిరి ప్రాంత ప్రజలు,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎల్సోజు నరేష్ పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్ సుంకరి జనార్దన్ మూల అశోక్ రెడ్డి జుమీలాల్ కందుకూరి లక్ష్మయ్య దానయ్య కందుకూరి అంబేద్కర్ మూల అశోక్ రెడ్డి చాగంటి రాములు కృష్ణ నాయక్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు