ఆత్మహత్యకు పాల్పడ్డ వివాహిత
తిరుమలగిరి 07 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ముద్దoగుల సుజాత (35) మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు నగేష్ 13సం,వైష్ణవి సంవత్సరాలు,భర్త నర్సయ్య ఉన్నారు.మృతికి గల కారణాలు తెలియలేదు. కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఫిర్యాదు రాలేదని తిరుమలగిరి ఎస్సై సురేష్ తెలిపారు.