నూతనకల్ మండలంలో అనాధలైన ఆడపిల్లలు

Oct 26, 2024 - 15:19
 0  1083
నూతనకల్ మండలంలో అనాధలైన ఆడపిల్లలు

విధి ఆడిన వింత నాటకంలో ఓ నిరుపేద కుటుంబం వీధిన పడింది.

తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఇద్దరు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

నూతనకల్ 26 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని విధి ఆడిన వింత నాటకంలో కుటుంబం వీధిన పడింది గత ఆరు సంవత్సరాల క్రితం గుండాల సరిత తల్లి, అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది ఆ తర్వాత తండ్రి లింగయ్య కూలినాలి పనులు చేసుకుంటూ ఇద్దరి పిల్లల్ని చదివించుకుంటూ కన్న తల్లిని పోషించుకునేవాడు దురదృష్టవశాత్తు గత ఆరు నెలల క్రితం తండ్రి మరణించడంతో పిల్లలు అనాధలయ్యారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఆడపిల్లలు లిఖిత(14) నికిత(13) నూతనకల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతి అభ్యసిస్తున్నారు సెలవు రోజుల్లో కూలి నాలు పనులు చేసుకుంటూ వృద్ధురాలైన తన నానమ్మ ఐలమ్మను పోషించుకుంటున్నారు కనీసం ఉండటానికి ఇల్లు లేదు ఇంట్లో నిత్యవసర సరుకులు లేవు దయని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నా అనే వాళ్ళు ఎవరూ లేకపోవడంతో దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాలాడుతున్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034