ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఇసుక క్వారీలు

Feb 10, 2025 - 19:16
Feb 10, 2025 - 19:48
 0  206
ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఇసుక క్వారీలు

ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఇసుక క్వారీలు...

పట్టాల పేరుతో భారీ అక్రమాలకు దారి...

ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక దలారి వ్యవస్థను నిర్మూలించాలి... జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి 

 వెంకటాపురం తెలంగాణ వార్త ఫిబ్రవరి 10:-
ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ఇసుక క్వారీలు నిర్వహణ జరుగుతుందని పూనెం సాయి ఆరోపించారు.వెంకటాపురం మండల కేంద్రంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ సమావేశంలో ములుగు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు పూనెం ప్రతాప్ అధ్యక్షతన వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన,ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని నూగూరు వెంకటాపురం మండలంలో వివిధ ఆదివాసి గ్రామాల్లో ఇసుక క్వారీలు ఫైలు చేస్తూ (డిఎల్ఎస్సి) నిర్వహించకుండా ఇసుక ర్యాంపుల కార్య నిర్వహణలు జరుపుతున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు సైతం ఏజెన్సీ ప్రాంత చట్టాలను పాతర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజన ఇసుక సొసైటీల పేరుతో గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని, పట్టా భూమూల క్వారీలకు ఎటువంటి సర్వేలు నిర్వహించకుండా అనుమతులు ఇస్తున్నారని ఇది రాజ్యాంగాన్ని కూని చేయటమేనని అన్నారు. జిల్లా అధికారులు కూడా గిరిజన ఇసుక సొసైటీ డి,ఎల్,ఎస్,సి నిర్వహించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఇది కేవలం గిరిజన అభివృద్ధి నీ అడ్డుకోవడానికి తావిస్తుందని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు నిద్ర మత్తు వదిలి వెంటనే (డిఎల్ఎస్సి) నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏటూర్ నాగారం (ఐటిడిఏ) వ్యాప్తంగా పట్టా భూముల పేర్లతో అక్రమంగా ఇసుక క్వారీలకు అనుమతులు ఇస్తున్నారని,ఇప్పటివరకు పట్టా భూముల్లో ఇసుకను మేటలను తొగించి ఎంత భూమి సాగు చేశారని ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగారు.పట్టా భూములకు ఇసుక మేటలు తొలగిపులకు అనుమతులు ఇవ్వాలంటే,మరల వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా ఉంటేనే వాటికే అనుమతులు ఇవ్వాలని కోరారు.

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు అందవలసిన ఫలాలు గిరిజనేతరుల చేతులకు వెళ్తున్నాయని,ఇసుక ర్యాంపులో బినామీ వ్యవస్థను నిర్మూలించే విధంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ యువత నరేష్,చంటి, రవి తదితరులు ఉన్నారు.

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్