టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించిన""ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు

షేర్ మహమ్మద్ పేట గ్రామంలో టిడిపి సభ్యత్వ నమోదు పండగ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దదిక్కుగా చంద్రబాబు గారు పార్టీ సభ్యులకు అండగా ఉంటాను
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య భరోసా
జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో 50% ఓటర్లు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకోవడమే లక్ష్యంగా అందరం సమిష్టిగా కలిసి పని చేద్దామని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జగ్గయ్యపేట మండలం, షేర్ మహమ్మద్ పేట గ్రామంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు పాల్గొని ముందుగా ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు మాట్లాడుతూ
_రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపును ఒక అదృష్టంగా భావించి ఆయన సంతృప్తి చెందేలా ప్రతి ఒక్కరం సభ్యత్వ నమోదు ను చేపడుదామని తెలిపారు._
_అనుకోని ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే సొంతవారే పట్టించుకోని ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటి పెద్దదిక్కుగా తమ పార్టీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటున్నారని తెలిపారు చనిపోయిన వెంటనే మట్టి ఖర్చుల కింద రూ 10,000 ఇవ్వడమే కాకుండా ఐదు లక్షల ప్రమాదభీమా అందజేయనున్నారని తెలిపారు. గతంలో ప్రమాదపు శాత్తు మరణిస్తే 2,00,000 ఇవ్వడం జరిగిందని దానిని చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది.ఈరోజు 26.10.2024 శనివారం నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆయా గ్రామాల నాయకులు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించాలని తెలిపారు ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చేర్చుకోవడానికి కృషి చేయాలన్నారు. అధిక సభ్యత్వాలు చేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని అన్నారు._
_ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు._