నన్ను ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

May 22, 2024 - 20:32
May 23, 2024 - 15:45
 0  170
నన్ను ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

తిరుమలగిరి 23 మే 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే 46,317 జీవన కారణంగా నష్టపోయిన వారికి న్యాయం చేస్తానని బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం తిరుమలగిరి మండల కేంద్రం బిజెపి కార్యాలయంలో తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి కడియం రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాల ప్రాంతాల అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మూడు జిల్లాల్లోని పర్యటిస్తున్నానని, బిజెపికి గతంలో కంటే ఎంతో ఎక్కువగా సానుకూల పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఇటీవల జరిగిన లోకసభ ఎన్నికల్లో ప్రజలు అత్యధికంగా దేశ ప్రధాని మోడీ పాలన మరోసారి కేంద్రంలో ఉండాలని ఆలోచనతోనే ఓట్లు వేశామని తెలిపారన్నారు.

   తెలంగాణలో కచ్చితంగా 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు. అబద్దాల హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, సంక్షేమ మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ పార్టీ కుంటు పడిందని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నిలకడ లేని పార్టీ అభ్యర్థులని వారిని ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని అన్నారు. రైతులకు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రులకు మోసపూరిత వాగ్దానాలు చేసి గెలిచి, ఎమ్మెల్యే స్థానం కోసం పట్టభద్రులను గౌరవించకుండా అవమానపరిచారని, ఆ పార్టీ అభ్యర్థికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఈ రెండు పార్టీలు విద్యార్థుల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి పట్టించుకోవడం లేదన్నారు. మేడిగడ్డ, ఫోన్ టాపింగ్, ధరణి,నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్, 46 జీవో రద్దు వీటిపై హడావిడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటి గురించి ప్రస్తావించే ఊసే లేదన్నారు.

 ఈ విధంగా మోసపూరిత వాగ్దానాలు, మోసం చేసే పార్టీలకుతగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఓడిన గెలిచిన 43 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలను పరిష్కరించే ఆలోచన విధానంతో పని చేస్తు, బిజెపి అభ్యర్థి అయిన తను పట్టభద్రులకు ఒక నిబద్ధతతో కలిగిన సేవ చేసే అర్హత తనకే ఉందన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే పీఎం ఈజిపి, ముద్ర లోన్స్, విశ్వకర్మ యోజన, స్వనిధి యోజన, బిగ్ సి, వీటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నిస్తానన్నారు. అదేవిధంగా గెలిపిస్తే మోడీతో మాట్లాడి ఒప్పించి ఖమ్మం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయాన్ని వచ్చే విధంగ ఏర్పాటు చేస్తామన్నారు.

 కావున పట్టభద్రులందరూ మొదటి ప్రాధాన్యత ఓటు బిజెపికే ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గం బిజెపి పార్టీ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రేమేందర్ రెడ్డి గతం నుంచి ప్రజా సమస్యలపై ఎన్నో చేస్తున్నారని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మెడబోయిన యాదగిరి, వేల్పుల బంగార్రాజు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, చిరబోయిన హనుమంతు, శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034