ఫిట్నెస్ లేని ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు సీజ్ - ఆర్టీవో వెంకటేశ్వరరావు

జోగులాంబ గద్వాల 15 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లాలో నీ ఐజ, శాంతినగర్ ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన 6 బస్సులను సీజ్ చేసినట్లు ఆర్టీవో వెంకటేశ్వరరావు తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 6బస్సులను మంగళవారం సిబ్బందితో కలిసి గుర్తించి సీజ్ చేయడం జరిగిందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బస్సులు పూర్తిగా ఫిట్నెస్ కలిగి ఉండాలన్నారు.అనుభవజ్ఞులైన డ్రైవర్లును బస్సులు నడిపేందుకు నియమించుకోవాలని విద్యాసంస్థల అధినేతలను హెచ్చరించారు.