అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్
జోగులాంబ గద్వాల 30 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల:-అంగన్వాడి కేంద్రాలలో ఉన్న చిన్నారులకు సెప్టెంబర్ 1 నుండి 30 వరకు వర్ణమాలలను సరిగా పలకగలిగే స్థాయికి చేరుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అంగన్వాడి టీచర్ల కు ఆదేశించారు.శుక్రవారం కాలూర్ తిమన్ దొడ్డి మండలంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆవరణంలో పూల మొక్క ను నాటారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులు సరైన విద్యను అందుకోవడంలో కొన్ని లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా వర్ణమాల నేర్పడంలో తగిన శ్రద్ధ లేదు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలు వర్ణమాలను అర్థం చేసుకుని, అవి సరిగా పలకగలిగే స్థాయికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నుండి యూనిఫార్మ్స్, స్లేట్స్ వంటి విద్యా సామగ్రి అందించడం జరుగుతుందని తెలిపారు. వాష్ రూమ్ సదుపాయాలు పక్కా ఉండాలని, ట్విన్ సోక్ పిట్స్ ఏర్పాటు చేయాలని ,పిల్లలకు త్రాగునీరు సకాలంలో అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఆర్థికాభివృద్ధికి మహిళా శక్తి యూనిట్లు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు.
అనంతరం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన మహిళా శక్తి యూనిట్లను సందర్శించారు. మహిళా శక్తి యూనిట్లలో కిరాణం, కుట్టు మిషన్ వంటి ఎంటర్ప్రైజెస్ పనితీరును పరిశీలించారు. మహిళా శక్తి యూనిట్లు తమ స్వయం ఉపాధి కోసం ఎంతవరకు ప్రయోజనం పొందుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కిరాణం మరియు కుట్టు మిషన్ ఎంటర్ప్రైజెస్‌లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యూనిట్ల నిర్వహణ, వాటికి అవసరమైన వసతులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. బ్యాంకు నుండి లక్ష రూపాయల ఋణం పొందడం జరిగిందన్నారు. కుటుంబ స్థాయిలో ఆర్థికాభివృద్ధికి మహిళా యూనిట్లు ఎంతగానో దోహదపడతాయని, తమ స్వయం కృషితో ఎదగాలన్న భావనను కలెక్టర్ ప్రోత్సహించారు. కంప్యూటర్ డిజైన్, పాఠశాల యూనిఫార్ముల తయారీకి కావలసిన సదుపాయాలు అందుబాటులోకి తెస్తామని అన్నారు.
మండల పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, తరగతుల వివరాలు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లోని వసతులను పరిశీలించారు. పిల్లలను అల్ఫబెట్స్ అడగగా సమాధానం చక్కగా ఇచ్చరాని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి, వారికి కావలసిన విధంగా పాఠాలు నేర్పించలన్నారు. పిల్లలకు యూనిఫార్మ్స్ అందించాలని ఎ.పి.యం , వి.ఓ లకు కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగా రావు, జిల్లా శిశు సంక్షేమ అధికారి సుధారాణి, ప్రధానోపాధ్యాయుడు మురళి మనోహర్, అంగన్వాడి సిబ్బంది, స్వయం సహాయక సంఘం మహిళలు, పాటశాల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు...