హలో పద్మశాలి ఛలో హైద్రాబాద్

Mar 7, 2025 - 19:42
 0  2
హలో పద్మశాలి ఛలో హైద్రాబాద్

*హలో పద్మశాలి ఛలో హైద్రాబాద్* 

 *పద్మశాలి మహాసభలు విజయవంతం చేయండి.* 

 *తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి* 

ఖమ్మం : 9/3/2025 ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ & 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి , జౌళి మరియు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు , శ్రీమతి కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ లు హాజరవుతారని కావున పద్మశాలి కుల బాంధవులందరూ ఈ మహాసభలు కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పాల్గొని పద్మశాలిల ఐక్యత , సత్తా చాటాలని తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ కమర్తపు మురళి పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో చిలకమర్రి శ్రీనివాస్ బాబు , పెండెం జనార్ధన్ , బండారు శీను , రచ్చ శ్రీను , పులిపాటి సంపత్ , తాటి శీను , చందా వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333