ప్రభుత్వ పథకాలు ,సిజనల్ వ్యాధులపై అవగాహన
జోగులాంబ గద్వాల 30 ఆగస్టు 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా సమాచార శాఖ డీపీఆర్వో సారథ్యంలో శుక్రవారం జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు కేటి దొడ్డి మండలంలోని ముసలి దొడ్డి, గంగన్ పల్లి గ్రామాల్లో సీజనల్ వ్యాధులయినా డెంగ్యూ,మలేరియా మరియు సైబర్ నేరాలు, అక్ష్యరాస్యత,రోడ్డు ప్రమాదాల నివారణ,మహిళల భద్రత,అదేవిధంగా ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను ఆట పాట మాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు కేశవులు, రెలారే ప్రసాద్, డప్పు కృష్ణ, రమాదేవి, స్వామి, భూపతి, హజరత్ లు పాల్గొన్నారు.