పరిమితి కి మించిన ఆర్ఎంపీల వైద్యం
23-03-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండలంలో పరిమితికి మించిన ఆర్ఎంపిల వైద్యం.
ప్రథమ చికిత్స కేంద్రాలు జప్తు.
చిన్నంబావిలో రెండు ఆర్ఎంపి హాస్పిటల్స్ ను సీజ్ చేసిన అధికారులు.
చిన్నంబావించాలని మండల కేంద్రంలో శనివారం జిల్లా వైద్యాధికారులు ప్రథమ చికిత్స కేంద్రాలపై దాడులు నిర్వహించి పలు చికిత్స కేంద్రాలను జప్తు చేశారు. పై విషయంపై వైద్యాధికారులను వివరణ కోరగా తమకు చిన్నంబావి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ప్రథమ చికిత్స కేంద్రాలపై ఫిర్యాదులు వచ్చాయని వాటి ఆధారంగా శోధాలు నిర్వహిస్తున్న సమయంలో మందుల చిట్టిని మందులను రోగులకు ఆర్ఎంపీ డాక్టర్లే అందిస్తుండడం గమనించామని అలాగే వృద్ధ రోగులకు సూదులు ఇస్తుండడం గమనించి, హద్దులు దాటి ప్రథమ చికిత్స కేంద్రాలు నడుపుతున్నారని వాటిని తాత్కాలికంగా జప్తు చేయడం జరిగిందని మండల పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ప్రధమ చికిత్స కేంద్రాలు మరియు మందుల షాపులకు నోటీస్ ఇస్తామని తెలిపారు.
మండల కేంద్రంలో ప్రైవేట్ దవాఖాన నిర్వహిస్తున్నప్పటికీ అందులో గుర్తింపు పొందిన డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి కానీ ఆ ప్రైవేట్ దవాఖాన లో వారానికి ఒక్కరోజు మాత్రమే ఎంబిబిఎస్ డాక్టరు వైద్య సేవలు అందిస్తున్నారని గుర్తించాం. అలాంటిిి దావకానకు కూడా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఈ సోదాలను జిల్లా వైద్యాధికారులు డిఎంహెచ్ఓ డాక్టర్ జయచంద్ర మోహన్, డిఈఎంఓ చంద్ర, డిప్యూటీ డిఈఎంఓ మద్దిలేటి మరియు హెల్త్ సూపర్వైజర్ మహేష్ నిర్వహించారు.