పదవ తరగతి విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్ తిరుపతి

Mar 7, 2025 - 18:52
Mar 7, 2025 - 18:53
 0  426
పదవ తరగతి విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్ తిరుపతి

జగిత్యాల : పట్టణ కేంద్రంలోని స్థానికగంజ్ వార్డులోనిఐటీ చుక్కా రామయ్య ఎస్ స్కూల్ లో జరిగిన సంఘటన స్కూల్ ఐడి కార్డ్ మర్చిపోయినందుకు పదవ తరగతి చదువుతున్న అబ్దుల్ హసేన్ అనే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్ తిరుపతి ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్లు వాపులు వచ్చేలాగా కొట్టడంతో ఆ పసి హృదయం చల్లడిల్లిపోయింది ఈ విషయాన్ని అబ్దుల్ హసేన్ ఇంటికి వెళ్లి వారి అమ్మకు ఫోన్లో చేసి చెప్పడంతో ఈ విషయం కాస్త బయటకు వచ్చింది వెంటనే అబ్దుల్ హసేన్ తల్లి ప్రిన్సిపల్ తిరుపతికి ఫోన్ చేసి నిలదీయగా నేను కొట్టలేదు మీ కొడుకు అని అబద్ధాలు చెప్తున్నాడు అని అన్నాడు మా కొడుకు అబద్ధాలు చెప్తే ఈ ఫోటోల్లో చూడండి విద్యార్థిని ఎలా చితకబాదాడో పూర్తిగా కనబడుతాయని అన్నారు అబ్దుల్ హసేన్ అనే పదవ తరగతి చదువుతున్న విద్యార్థి పవిత్రమైన రంజాన్ మాసం కావడంతో అబ్దుల్ హసేన్ రంజాన్ ఒక్కపొద్దు ఉండి రోజులాగే సక్రమంగా స్కూలుకు వెళ్లే హడావిడిలో కేవలం తన ఐడి కార్డ్ మరిచిపోవడంతో ఏదో చేయరాని తప్పు చేసినట్లుగా మిమ్మల్ని నమ్మి స్కూల్ కి పంపిస్తే ఇలా మా కొడుకును గొడ్డు ను బాదినట్టుగా బాదుతార అని ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు మిమ్మల్ని నమ్మి స్కూల్ కి పంపిస్తే ఇలా చేస్తారా వారి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారి స్పందించి మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా స్కూల్ ప్రిన్సిపల్ తిరుపతి పై కఠినమైన చర్యలు మాకు న్యాయం చేయగలరని విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333