బూతు లెవెల్ అధికారులకు జాతీయస్థాయి శిక్షణ

తిరుమలగిరి 16 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలోని బూతు లెవెల్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తహసిల్దార్ బి హరి ప్రసాద్ మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించడంతో ప్రతి గ్రామంలో ఉన్న వార్డు వారిగా ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్లను ఒక్క వ్యక్తి రెండు పేర్లు ఉన్న మరియు చనిపోయిన వారి జాబితాను మొత్తం సవరణ చేయాలని జిల్లా పరిషత్ హైస్కూల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ ఎస్ కే జాన్ మహమ్మద్ మాస్టర్ ట్రైనర్స్ అశోక్ రెడ్డి,సత్యనారాయణ బి ఎల్ వో సూపర్వైజర్లు పాల్గొన్నారు.