అడ్డగూడూరులో ఘనంగా ఎంపీ చామల జన్మదిన వేడుకలు

Jul 23, 2025 - 20:45
Jul 23, 2025 - 20:49
 0  16
అడ్డగూడూరులో ఘనంగా ఎంపీ చామల జన్మదిన వేడుకలు

*అడ్డగూడూరులో ఘనంగా ఎంపీ చామల జన్మదిన వేడుకలు*

అడ్డగూడూరు 23 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు చెడే మహేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మనగోటి జోజి,చెడే మహేందర్ మాట్లాడుతూ..చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల కోసం ఆదరణగా నిలుస్తున్నారు.ప్రజల అవసరాలపై ఆయన శ్రద్ధ చూపుతూ,కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి సమర్థంగా పోరాడుతున్నారు. ఆయన నాయకత్వంలో భువనగిరి పార్లమెంటు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు పూలపల్లి సోమిరెడ్డి.వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,సీనియర్ నాయకులు వల్లoభట్ల రవీందర్రావు.మాజీ ఎంపీటీసీ గూడెపు పాండు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి రమేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చెడే అంబేడ్కర్,అడ్డగూడూరు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి,బీసీ సెల్ మండల అధ్యక్షులు నాగులపల్లి రమేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెంల విద్యసాగర్, మెడబోయిన శీను,సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు పూలపల్లి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలెoల సురేష్,గడ్డం సోమన్న గౌడ్,సోమన్న,మందుల సోమన్న,యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా నాయకులు కన్నెబోయిన రాజశేఖర్ యాదవ్, పయ్యావుల సాయి,సూతరపు నరేష్,తదితరులు పాల్గొన్నారు.