మున్సిపాలిటీలో వీధి కుక్కల స్వైర విహారం

వాహనాల వెంటపడి పరుగుపెట్టిస్తున్న వీధికుక్కలు...
గాయాలపాలవుతున్న చిన్నారులు, వాహనదారులు...
గర్జిస్తున్న గ్రామ సింహాలు...
భయాందోళనలో స్థానికులు...
పట్టించుకోని అధికారులు, పాలకులు........
తిరుమలగిరి 16 జులై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి. వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో రోడ్లపైకి గుంపుగుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్ళే వారిపై దాడులు చేస్తుండడంతో కుక్కలు కనబడితే చాలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో వీధి కుక్కల స్వేచ్ఛగా తిరగడం వలన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రోడ్లపై తిరిగే వారిపై కుక్కలు దాడి చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.......