మల్దకల్ సింగల్ విండో సొసైటీ ని సందర్శించిన కలెక్టర్.

Jul 23, 2025 - 20:53
Jul 23, 2025 - 20:54
 0  1
మల్దకల్ సింగల్ విండో సొసైటీ ని సందర్శించిన కలెక్టర్.
మల్దకల్ సింగల్ విండో సొసైటీ ని సందర్శించిన కలెక్టర్.

*మల్దకల్ సింగల్ విండో సొసైటీ ని సందర్శించిన కలెక్టర్.*

*జోగులాంబ గద్వాల 23 జూలై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.*

 సింగల్ విండో సొసైటీ ని కలెక్టర్ BM.సంతోష్ సందర్శించడం జరిగింది. యూరియా సప్లై గురించి రైతులకు ఎన్ని బస్తాలు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు ఈపాస్ ద్వారానే కచ్చితంగా ఎంట్రీ చేసి ఇవ్వాలని కలెక్టర్ సూచించడంజరిగింది. అలాగే ఎం. ఆర్. పి. రెట్లకే అమ్మాలని చెప్పడం జరిగింది.DAO సక్రియనాయక్ ని మరియు ADA సంగీత లక్ష్మి ని రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా అందుబాటులో ఉంచాలని చెప్పడం జరిగినది.

చైర్మన్ S. తిమ్మారెడ్డి తో మరియు DCO జి. శ్రీనివాసులు తో సంఘం యెక్క వివరాలను అడగటం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో రైతులకు యూరియా మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువుల కొరత లేకుండా చూడాలని చూచించడం జరిగినది.

ఇట్టి కార్యక్రమంలో MAO రాజశేఖర్ , అసిస్టెంట్ రిజిస్టార్ మహేష్ , AEO కిషోర్, రాహుల్ మరియు సంఘ సెక్రటరీ, సిబ్బంది మరియు రైతులు పాల్గొనటం జరిగినది.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State