స్కూల్ విద్యార్థులకు బ్యాగులు,నోట్ బుక్కులు పేన్నులు,పెన్సిల్,ప్యాడ్,షూస్,బహుకరణ
సీఐ కుంభం నరసింహ గౌడ్
అడ్డగూడూరు 23 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో చౌళ్ళగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు హైదరాబాద్ సుల్తాన్ బజార్ సీఐ కుంభం నరసింహ గౌడ్ ప్రధానోపాధ్యాయులు పి జానయ్య గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు బ్యాగులు,నోట్ బుక్కులు,పేన్నులు,పెన్సిల్,ప్యాడ్ లు,డ్రాయింగ్ నోట్ బుక్కులు, షూస్ విద్యార్థినీ,విద్యార్థులకు బుధవారం రోజు అందజేశారు.అనంతరం సీఐ నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలోని పిల్లి సుందర్ కొన్ని సందర్భాల్లో చెప్పిన మాట ప్రకారం మన ఊరు బడికి మీ వంతు సహాయం మన ఊరికి చేయాలని అడగగా ఒప్పుకొని మాటే ఇచ్చి తప్పుకోకుండా కన్నతల్లి..ఉన్న ఊరు..ఏనాడు మరుపు రాదని..గుర్తు చేసినారు.వారు చదువుకునే రోజుల్లో తన తల్లిదండ్రులు పడ్డ కష్టాలను గుర్తు చేసుకుని విద్యార్థిని తల్లిదండ్రులకు భారం కాకుండా!నా ఊరు ప్రేమతో..నా తల్లిదండ్రుల సహకారంతో..నా వంతు సహాయం చేయడం జరిగిందని అన్నారు.భవిష్యత్తు రోజుల్లో ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినారు.సిఐ నరసింహ గౌడ్ పిల్లలకు ఒక ప్రశ్న వేశారు.పిల్లలు బాగా చదువుకుంటున్నారా?విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకుంటున్నాం సార్ అని జవాబు ఇచ్చారు.నేటి బాలలే...రేపటి పౌరులని అన్నారు.మీరు బాగా చదువుకొని ఉన్నంత స్థాయికి ఎదిగి మన ఊరికి మీ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు.నాకంటే పెద్ద స్థాయి ఉద్యోగాలు సాధించాలని కోరారు.సిఐ కుంభం నరసింహ గౌడ్ కు విద్యార్థుల తల్లిదండ్రులు సాల్వతో సన్మానించారు.మా పాఠశాలకి వచ్చి మా పిల్లలకు ఇలాంటి సహాయ సహకారాలు చేసినందుకు ప్రధానోపాధ్యాయులు జానయ్య గౌడ్ సాల్వతో చిరు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పిల్లి సుందర్,మంటిపల్లి రామచంద్రు,కుంభం అంజయ్య గౌడ్,కుంభం సోమయ్య గౌడ్,మాజీ వార్డ్ నెంబర్ లోడే యాదగిరి గౌడ్,విద్యార్థుల తల్లిదండ్రులు,పిల్లి గంగయ్య,లోడే రవి గౌడ్,పిల్లి ఆంజనేయులు,బోడ గణేష్,నిర్మాల సందీప్,రొడ్డ బిక్షం,కడియం అండాలు,బోడ సంధ్య, మోలుగురి స్వాతి,బోడ సునీత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.