జూరాల ప్రాజెక్టు ను సందర్శించిన డీఐజీ చౌహన్
*జూరాల ప్రాజెక్టు ను సందర్శించిన డీఐజీ చౌహన్.*
*జోగులాంబ గద్వాల 23 జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి.*
*ధరూర్.*
:జూరాలకు వరద ఉధృతి కారణంగా నదీ పరీ వాహక గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ చౌహన్ సూచించారు. బుధవారం ఆయన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి జూరాల ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పెరగడం వల్ల నదీ పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.గద్వాల,వనపర్తి జిల్లాల్లో చెరో ఆరు గ్రామాలు ముంపు కి గురి అయే అవకాశాలు ఉన్నందున
జిల్లా అధికారులు ,ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.