ఏనుభాముల గ్రామంలో మద్యపాన నిషేధం పై ర్యాలీ. మండల జేఏసీ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ఏనుభాముల గ్రామంలో మద్యపాన నిషేధం పై ర్యాలీ* మండల జేఏసీ సంఘీభావం. ఆత్మకూర్ ఎస్... మద్యo కారణంగా పచ్చని పల్లెల్లో పేదల ప్రాణాలు కోల్పోతున్నారని అందుకే గ్రామం లో మద్య నిషేధం చేపట్టాలని బెల్ట్ షాపులు బంద్ చేయాలని బుధవారం ర్యాలీ నిర్వహించారు. గ్రామం లో ప్రతి నెల ఏదో ఒక అనారోగ్యం కారణంగా మృత్యు వాత పడుతున్నారని యూత్ నాయకుడు తగుళ్ల జనార్దన్ యాదవ్ అన్నారు. మద్య నిషేధం అమలు చేయాలంటూ ఈ నెల 9న గ్రామంలో అఖిల పక్షాల ఆద్వర్యం లో సమావేశం ఏర్పాటు చేసి తీర్మాణించినట్లు తెలిపారు. బెల్ట్ షాపుల వారి కోరిక మేరకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు.ఫిబ్రవరి 1నుండి గ్రామం లో బెల్ట్ షాపులు బంద్ చేయడమే కాక గ్రామం లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయనున్నట్లు తెలిపారు. *మద్య నిషేధం కు మండల జేఏసీ సంఘీభావం.* గ్రామంలో జరిగే మద్య నిషేధం ఉద్యమానికి మండల సామాజిక సేవా జేఏసీ సంఘీభావం తెలిపింది. గ్రామం లో నిర్వహించిన ర్యాలీ లో జేఏసీ చైర్మన్ భూపతి రాములు మాట్లాడుతూ మద్యం మహమ్మారి కారణంగా గ్రామాల్లో శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పడి ఘర్షణ లు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే గట్టికల్, ఇస్తాలపురం, పాతర్ల పహాడ్, గ్రామాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు అవుతుందని తెలిపారు. మద్య నిషేధం అమలు ఉన్న గ్రామాల్లో గొడవలు అనారోగ్యాలు సమసి పోయాయని ప్రజలు ఎవరి పని వారు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఎనుబాముల గ్రామంలో మద్యపాన నిషేధం అమలు కు ముందుకొచ్చిన యువకులకు అభినందనలు తెలిపారు. ఫిబ్రవరి 1నుండి బెల్ట్ షాపులు బంద్ చేసి గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమం లో సీతారాములు, ఆంజనేయులు, నవీన్, సైదులు, నరేష్, శ్రీను, మహేష్, నాగరాజు, వంశి పాఠశాల విద్యార్దులు పాల్గొన్నారు