వికలాంగులకు పెన్షన్ పెంచాలని

వికలాంగులకు పెన్షన్ పెంచాలని వృద్ధులకు,వితంతువులకు ఒంటరి మహిళలు వెంటనే పెన్షన్ అందించాలి

Jul 23, 2025 - 20:43
Jul 23, 2025 - 20:48
 0  14
వికలాంగులకు పెన్షన్ పెంచాలని

అడ్డగూడూరు 22 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రం నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు భువనగిరిలో జరిగే మహాసభకు బయలుదేరారు.మంగళవారం రోజు భువనగిరిలో జరిగే మీద వికలాంగుల మరియు చేయూత పింఛన్ దారుల మహా గర్జన సన్నాహక సదస్సుకు ముఖ్య అథిదిగా డా"పద్మ శ్రీ మందకృష్ణ మాధిగ ఈ సదస్సుకు హజరవుతున్నారు.సదస్సును విజయవంతం చేయుటకై అడ్డగుడూరు మండలం నుండి బయల్దేరినా ఎమ్మార్పీఎస్ మరియు వి.ఎస్,పి,ఎస్ సంఘం నాయకులు కార్యకర్తలు,పెన్షన్ లబ్ధిదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.