తెలంగాణ సమాజం సోనియా గాంధీ ని మరవదు
రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు
అఖిలభారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంపిణీ చేసిన అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర రావు మాట్లాడారు. తెలంగాణ సమాజం సోనియా గాంధీ ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తీర్చి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు భావితరాలకు తెలిపే విధంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఉత్సవాలను ఒక పండుగ లాగా జరుపుకుంటుంటే, బిఆర్ఎస్ నాయకులకు కంటగింపుగా ఉందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కి కృతజ్ఞతలు తెలపకపోగా అసెంబ్లీ నుండి పారిపోయిన ప్రతిపక్షం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్సవాల్లో చివరి రోజు సెక్రెటేరియట్ లో తల్లి ని ప్రతిబింబించే ఆహార్యంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే ఓర్వలేక పోతున్నారని బిఆర్ఎస్ నాయకులను దుయ్యబట్టారు. అసెంబ్లీ కి హాజరై టిఆర్ఎస్ పక్షం నాయకులు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు. అభివృద్ధి కి అడ్డుపడితే చరిత్ర హీనులుగా మారిపోతారు అని అన్నారు. ఎవరు అడ్డుపడినా రాష్ట్ర అభివృద్ధి కి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చకిలం రాజేశ్వర రావు అన్నారు. బిఆర్ఎస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మవద్దని తెలంగాణ ప్రజను ఆయన కోరారు..