ఆశా వర్కర్ల బస్సు జాత
జోగులాంబ గద్వాల 23 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ఆశాలకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు నిర్ణయించి, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, సెలవులు ప్రకటించి పనిభారం తగ్గించాలని, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమోషన్ తదితర సమస్యలను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సుజాతా లో భాగంగా సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి జాత చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో ఆశా కార్యకర్తలు బతుకమ్మలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు తదితరులు ఉన్నారు